TelanganaIndex


People Demanding Telangana...

హోమ్ ఈ−మెయిల్ ఇప్పటివరకు పంపినవాళ్ళు సంప్రదించండి

49 > Mails Sent

కవుల్లో, కలాల్లో, గలాల్లో మా కాళోజి ప్రస్తావన ఏది? అంటే మా కాళన్న అంత గొప్ప కవి కాడా? సన్నని నడుములు, వోరచూపుల మీద ఎంకీ అంటూ వంకర రచనలు చేసే కాపీ కవులే కవులా? మా కాళన్న కవే కాడా? మాది సాహిత్యమే కాదా?? ఇది వివక్ష కాదా???

తెలంగాణ చిహ్నం బతుకమ్మ, మతుకు ఆట, పాట, బతుకు తోట. మరి ఆంధ్ర చిహ్నం ఎగురేసుకు పోయిన పూర్ణకుంభం. మీకు మాత్రమే కావాలనుకునే భాండం.

తెలంగాణ లో పెద్ద పండుగలు... పెద్దల పండగ లేదా పెత్రమాస (మాహళయ అమావాస్య), దసర, సద్దులు-బతుకమ్మ, హోళీ, ఏకాశి. మా పండగలకు కనీసం సెలవులు కూడా లేవు. ప్రభుత్వ సెవవు దినాలలో తెలంగాణ పండుగల ఉనికే లేదు. ఇది తెలంగాణ సంస్కృతిని కనుమరుగు చేసే ప్రయత్నమే.

ఎవని నల్లధనం హైదరాబాదులో బినామి ఆస్తుల రూపంలో మురుగుతున్నదో, వాడే సమైక్య.... సమైక్య అని శంకిని వేశం వేస్తున్నాడు. సామాన్య ఆంధ్ర సోదరునికి సమైక్య అవసరమే లేదను కుంటున్నాడు. న్యాయంగా అయితే తెలంగాణ ఇవ్వాల్సిందే అని అంటున్నాడు.

వోక్స్ వాగన్ పోనాది.... మరేటి సేత్తాం. నీ ప్రజలకు కొంచెం మేలు చేయాలంటే ప్రత్యేక ఉత్తరాంధ్ర కై నినదించు.

దొంగలు దొంగలు కలిసి వూళ్ళు పంచుకున్నట్లుగా.... అన్ని ఆంధ్ర పార్టీలు, పెట్టుబడిదారులు అంతా ఒక్కటై తెలంగాణను ఆపాలని ప్రయత్నిస్తున్నాయి. జర బద్రం తెలంగాణ తమ్మి.

కనీసం కరెక్ట్ గా, స్పశ్టంగా డైలాగ్ కొట్టడమే రాదు, డూప్ లేకుండా ఫైట్ చెయ్యలేరు, ముఖం అద్దంలో చూసుకోండ్రి. మీరు హీరోలా?

ఇక్కడ ఆంధ్ర కాలనీ లు బెట్టుకున్న ఏమన్లేదు. పచ్చల్లమ్ముకోవడానికి వచ్చినొడు పత్రికల అధిపతులైన ఏమన్లేదు.

మీ విశ్వనాథ, శ్రీ శ్రీ లకు వినమ్రంగ మొక్కుతాము… మా ధాశరథి కాళోజీ లను దాశిపెట్టుడు తప్పు కాదా..?

మనకు బతకడం రాదు అన్నోడు, మనను మోటు మన్శులన్నోడు, మన తిండి ని సూశి నవ్వినోడు, మనది తెలుగే కాదన్నోడు, శిగ్గు షరం లేక మనందరం ఒక్కటె కలిసే ఉందాం అంటున్నడు.

బతుకమ్మకు అట్లతద్దె కు బందుత్వం ఎప్పటిది..! ని అట్టు కు నా జొన్నరొట్టెకు చుట్టరికం ఎక్కడిది..?

నామాటలల్ల అక్కడక్కడ సభ్యతలేదనే ఆక్షేపణవస్తదని నాకెర్కే, కాని నాభాష, నాయాస, నాబతుకు, నా తెలంగాణ ప్రజల పట్లసభ్యతగా ప్రవర్తీంచని వాణితో నాకేం సభ్యత అనేదే నా జవాబు. - కాళోజి నారాయణరావు

ఖండాలు దాటిన జానపద గీతం నాది. ప్రపంచ చరిత్ర కే పాఠాలు నేర్పిన పోరాటాల వారసత్వం నాది.

చేతుల చెయ్యేసుకొని తల్లికి జై కొడదాం రండి...! ఈ నేలను అవమానించినోని గుండెల్లో తెలంగాణ డప్పుల దరువెద్దాం రండి..!!!

జై తెలంగాణ..!

జై జై తెలంగాణ !!!

TelanganaIndex.Com © 2010
Design: Kesek Solutions, Warangal
Tell A Friend | Privacy | Sitemap | XHTML | CSS

1946 లో మా తాత సాయిలు, తెలంగాణ సాయుధపోరాటంలో ప్రాణాలకు తెగించి పోరాడాడు.

1969 లో మా నాయిన సాంబయ్య, ప్రత్యేక తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్నాడు.

2000 సంవత్సరం నుండి నేను ప్రత్యేక తెలంగాణ కోసం ఉద్యమిస్తున్నాను. ఈ తెలంగాణ ఎప్పుడు వస్తది. మూడు తరాల నుండి, 60 ఏండ్ల సంది తెలంగాణ బతుకు పోరాటం శేస్తనే వున్నం. ఇంగ మా తెలంగాణ ఎప్పుడు వస్తది, మా గోస ఎప్పుడు తీర్తది.

ఇగ నా కొడుకు కూడ సమైక్య రాశ్ట్రం ల బాదలు పడుకుంటా....... వేరు తెలంగాణ కావాలే... కావాలే అని మొత్తుకోవాల్న? లే! అవసరం లేద్!! ఈ దెబ్బతో తెలంగాణ రావాలే.

 

ఈ వెబ−సైట్ ద్వార ప్రత్యేక తెలంగాణాను డిమాండ్ ని భారత ప్రధానమంత్రి, రాశ్ట్రపతి, ఉప−రాశ్ట్రపతి, సోనియాగాంధీ గార్లకి చేరవేయండి. మెయిల్ అనే పేజీలో వున్న ఫారం నింపి పంపండి, పైన చెప్పిన అందరికి ఈ−మెయిల్ పోతది. ఈ వెబ−సైట్ టార్గెట్ ఒక కోటి ఈ−మెయిల్స్ పంపడం. కుప్పలు తెప్పలుగా వచ్చి పడే మీ ఈ−మెయిల్స్ తో, కేంద్ర ప్రభుత్వానికి తెలంగాణ ప్రజలు ఎంతగా ప్రత్యేక రాశ్ట్రాన్ని కోరుకుంటున్నారో అర్ధం కావాలే; వెంటనే స్పందించి ప్రత్యేక రాశ్ట్రాన్ని ప్రకటించాలె. మీ దోస్తులకు, బందువులకు కూడ మెయిల్స్ పంపించమని చెప్పండి. స్పామ్ చెయ్యవద్దు. ఒక్కరు ఒక మెయిలే పంపించండి. స్పామ్ చేసారో.... మీ మెయిల్స్ ని బ్లాక్ చెయ్యవచ్చు, కాబట్టి మీ తెలంగాణ డిమాండ్ చేరదు, ఈ వెబ−సైట్ ఆశయం నెరవేరదు.

 

మీ వంతు మెయిల్ పంపడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.